Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

కలం, వెబ్ డెస్క్ : తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తమిళనాడులోని కోయంబత్తూరు (Coimbatore) లో ఓ యువతిపై కక్ష పెంచుకుని ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పలు క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న చెన్నైకి చెందిన వ్యక్తి తనను ప్రేమించాలని యువతి వెంట పడ్డాడు. అతని గురించి తెలుసుకున్న విద్యార్థిని యువకుడిని దూరం పెట్టింది. దీంతో అవమానంగా భావించిన సదరు యువకుడు యువతిపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో బైక్ పై పెట్రోల్ బాంబులతో వచ్చి యువతి ఇంటిపై విసిరి పరారయ్యాడు. బాంబు విసరడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read Also: జగిత్యాల కాంగ్రెస్ నిరసనలో ఆర్టీసీ డ్రైవర్ ఝలక్

Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>