Mobile Popup Ad
Mobile Popup Ad

వైఎస్సార్ పై అసత్య ఆరోపణలు చేస్తే బాగోదు.. పవన్ కళ్యాణ్ కు కేవీపీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( వైఎస్సార్) తనపై అప్పట్లో కేసులు పెట్టాలని ప్లాన్ చేశారని , ఆయన రెచ్చగొట్టడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై దివంగత వైఎస్సార్ సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) ఫైర్ అయ్యారు. జనం మెచ్చిన నాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేవీపీ రామచంద్రరావు ఓ బహిరంగ లేఖ రాశారు.

వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టాలని చూశారనే ఆరోపణ పూర్తిగా తప్పు అని లేఖలో కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ప్రజా పాలనే తప్ప పవన్ కళ్యాణ్ పై, ఆయన రాజకీయ భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి ఆలోచించాల్సిన అవసరం వైఎస్సార్ కు ఏముంది అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు ఆయనకు చెప్పిన పోలీసు అధికారికి లై డిటెక్టర్ పరీక్ష చేయడానికి సిద్దమా? అని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ తన ఆరోపణలు నిజమని నమ్మితే ఈ సవాల్ కు అంగీకరించాలన్నారు. ఈ క్రమంలో రోజుకు ఒక రంగు మార్చే ఊసరవెల్లులు ఉన్న ఈ కాలంలో గుర్తుకు రావాలసింది నికార్సైన వైఎస్సారే అని పేర్కొన్నారు.

కాగా, ‘బాలు’ సినిమా షూటింగ్ తర్వాత తనను కలిసిన ఓ పోలీస్ అధికారి .. తనను వైఎస్సార్ బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారని పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో తెలిపారు. భవిష్యత్ లో కేసులు పెట్టే అవకాశం ఉందని సదరు పోలీసు అధికారి తనకు చెప్పారని వెల్లడించారు. వైఎస్సార్ ఆ రోజు తనను రాజకీయంగా వేధించి, రెచ్చగొట్టకపోతే తాను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ హయాంలో రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే వాతావరణం ఉండేదని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>