epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం

కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో (Bangladesh) హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. గతంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవీ బాధ్యతలు తప్పుకున్నారు. ఆ తర్వాత బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఆ పార్టీ కార్యకలాపాలపై ఇప్పటికే నిషేధం కొనసాగుతుంది. మరోవైపు ఆ దేశ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహమాన్ 17 ఏండ్ల తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇటీవల తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలుబడింది. ప్రస్తుతం దేశంలో ఆ పార్టీ రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా నిషేధించబడ్డాయని, రాబోయే జాతీయ ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొనదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రత్యేక పార్టీ రిజిస్ట్రేషన్ కూడా రద్దైందని తెలిపింది. ఆవామీ లీగ్ పార్టీ నేతలు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ శిక్షా ప్రక్రియలో ఉన్నారని, అవామీ లీగ్, దాని అనుబంధ పార్టీలపై పూర్తిగా నిషేధించినట్టు బంగ్లా (Bangladesh) ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. శిక్షా ప్రక్రియలు పూర్తి అయ్యేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది.

గత సంవత్సరం జూలైలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం నుంచి  వైదొలగింది. దాదాపు ఏడాది తర్వాత బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అవామి లీగ్ పార్టీ నిషేధంతో షేక్ హసీనా (Sheikh Hasina) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “అవామి లీగ్ లేకుండా జరిగే ఎన్నిక ఒక ఎన్నిక కాదు. బంగ్లాదేశీల ఒక్క ఓటు కూడా లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నిర్వహిస్తారు. బంగ్లా ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’’ అని ఆమె హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>