కలం, ఖమ్మం బ్యూరో: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ‘మఖ్దూం భవన్’కు ముఖ్యమంత్రి తరఫున జన్మదిన శుభాకాంక్షల లేఖతో పాటు, ఒక అందమైన పుష్పగుచ్ఛాన్ని పంపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం పట్ల కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. తనపై ప్రత్యేక ఆదరాభిమానాలు చూపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చూపిన గౌరవం, ఆదరణ ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తన పుట్టిన రోజున ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా, అలాగే వ్యక్తిగతంగా తరలివచ్చి శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Read Also: మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్
Follow Us On: Sharechat

