గ్రీన్ VS ఎల్లో VS రెడ్.. ఆరోగ్యానికి ఏ రంగు క్యాప్సికం బెస్ట్?

కలం, వెబ్ డెస్క్: క్యాప్సికం (Capsicum).. ఈ కూరగాయను మనం రెగ్యులర్ వంటకాల కంటే పిజ్జా, సాండ్విచ్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే చాలా మందికి గ్రీన్ కలర్ క్యాప్సికం మాత్రమే తెలుసు. కానీ క్యాప్సికం గ్రీన్, ఎల్లో, రెడ్ అని మూడు రంగులలో లభిస్తుంది. అయితే ఈ మూడు రకాల క్యాప్సికం కేవలం రంగులలో మాత్రమే కాదు.. రుచి, పోషక విలువలు, సాగు విధానం, ధరలలో కూడా తేడా ఉంటుందని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికంలో లభించే విటమిన్లు, పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ముఖ్యంగా ఎరుపు రంగు క్యాప్సికం అత్యంత పోషక విలువలు కలిగిందిగా చెబుతున్నారు నిపుణులు. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్-A, విటమిన్-C, విటమిన్-B6 పుష్కలంగా లభిస్తాయట. గ్రీన్ కలర్ క్యాప్సికంతో పోలిస్తే రెడ్ క్యాప్సికంలో బీటా కెరోటిన్ సుమారు 11 రెట్లు ఎక్కువగా, విటమిన్-C 1.5 రెట్లు ఎక్కువంగా ఉంటుందట. రెడ్ క్యాప్సికంలో ఉండే బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇందులో ఉండే విటమిన్-B6 మెదడు పనితీరు మెరుగుపర్చేందుకు, ఎర్రరక్తకణాల ఉత్పత్తి, శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరమైన పోషకంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఎల్లో కలర్ క్యాప్సికంలో విటమిన్ – C, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. క్యాప్సికం పసుపు రంగు వచ్చేందుకు వయోలాక్సాంథిన్, క్యారోటినాయిడ్స్ వంటి సహజ వర్ణద్యవ్యాలు కారణమట. ఒక కప్పు ఎల్లో కలర్ క్యాప్సికంలో శరీరానికి రోజుకు అవసరమైన విటమిన్-C అవసరంలో ఎక్కువ భాగం లభిస్తుందని చెబుతున్నారు. అందుకే ఎల్లో కలర్ క్యాప్సికంను ఎక్కువగా సలాడ్లు, పాస్తా, గ్రిల్ చేసిన వంటకాల్లో ఉపయోగిస్తారని చెబుతున్నారు.

ఆకుపచ్చ క్యాప్సికంలో విటమిన్-C, విటమిన్-A, విటమిన్-K లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. 100 గ్రాముల క్యాప్సికంలో కేవలం 20 క్యాలరీలు మాత్రమే ఉండటంతో బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహార ఎంపిక అని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చైనీస్ వంటకాలు, సలాడ్లలో గ్రీన్ క్యాప్సికంను అధికంగా ఉపయోగిస్తున్నారు.

గ్రీన్ కలర్ క్యాప్సికంతో పోలిస్తే రెడ్, ఎల్లో కలర్ క్యాప్సికంల సాగు కొంత కష్టంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. గ్రీన్ క్యాప్సికం 60 నుంచి 70 రోజుల్లో కోతంకు సిద్ధం కాగా.. ఎల్లో, రెడ్ క్యాప్సికం పండడానికి 90 నుంచి 110 రోజులు పడుతుందట. అందువల్ల వీటి ఉత్పత్తి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా అన్ని రకాల క్యాప్సికంలు ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే అయినప్పటికీ పోషక విలువల పరంగా రెడ్ క్యాప్సికం ప్రథమ స్థానంలో ఉండగా, ఎల్లో రెండో స్థానం, గ్రీన్ మూడో స్థానంలో ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>