Mobile Popup Ad
Mobile Popup Ad

‘ మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాము రాజీనామాలకు సిద్ధమని.. మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన మీరు రాజీనామాకు రెడీనా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. ఎవరు రాజీనామాకు సిద్ధమో తేల్చుకోవాలన్నారు.

నన్ను అడ్డుకునే దమ్ము ఉందా?

అలాగే తనను తెలంగాణ నుంచి తరమికొడతానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నారని, తనను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తనను తరిమికొట్టే వ్యక్తి ఇంకా ఈ గడ్డ మీద పుట్టలేదని ఘాటుగా స్పందించారు. తానేమి బీఆర్ఎస్ కార్యకర్తను కాదని, కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తను అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. పైకి చూడటానికి మాత్రం విమర్శలు చేసుకుంటున్నాయని కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు.

Read Also: నల్లగొండ జిల్లాలో రూపాయి అభివృద్ధి జరగలే.. కాంగ్రెస్‌పై జగదీశ్ రెడ్డి ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>