కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ లోని హేతంపూర్ దగ్గర ఘోర రైలు ప్రమాదం (Madhya Pradesh Train Accident ) జరిగింది. రైలు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతి చెందారు . ఉదయ్ పూర్ రైలులో మంటలు చెలరేగాయని వదంతులు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. దీంతో రైలు చైన్ లాగీ కిందకు దూకేశారు. ఈ క్రమంలోనే పట్టాలపై ఉన్నవారిని పాతాల్ కోట్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

