Mobile Popup Ad
Mobile Popup Ad

తొలి వికెట్‌తో టెన్షన్ పోయింది.. గర్నూర్ బ్రార్

కలం, స్పోర్ట్స్: భారత్ తరఫున అరంగేట్రం చేసిన యువ పేసర్ గర్నూర్ బ్రార్ (Gurnoor Brar) తన తొలి మ్యాచ్ అనుభవాలను పంచుకున్నాడు. అఫ్గానిస్థాన్‌పై (Afghanistan) తొలి వన్డేలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్న బ్రార్, ఒత్తిడి కంటే ఉత్సాహమే ఎక్కువగా ఉందని చెప్పాడు. అయితే తొలి వికెట్ పడిన తర్వాతే అసలు ఊరట లభించిందని వెల్లడించాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3/27 గణాంకాలతో రాణించిన బ్రార్, మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడాడు. భారత్ తరఫున ఆడటం తనకు ప్రత్యేక క్షణమని, ఈ స్థాయికి రావడానికి చేసిన కష్టం మొత్తం గుర్తుకు వచ్చిందని తెలిపాడు.

జట్టుకు తన వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఆలోచనతోనే బరిలోకి దిగినట్లు చెప్పాడు. తొలి అంతర్జాతీయ వికెట్ గురించి మాట్లాడిన బ్రార్ (Gurnoor Brar), అది తనకు ఒక మైలురాయి లాంటిదని అన్నాడు. ఆ వికెట్ దక్కిన వెంటనే మనసులో ఉన్న టెన్షన్ మొత్తం పోయిందని, ఆ తర్వాత మరింత స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలిగానని వివరించాడు. ఇక తన తొలి వికెట్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు.

ఆ క్యాచ్ గిల్ వైపు వెళ్లిన వెంటనే అది తప్పకుండా పట్టేస్తాడని నమ్మకం కలిగిందని సరదాగా చెప్పాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రార్ వేగంతో కూడా ఆకట్టుకున్నాడు. అతని బంతులు గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చాయి. అత్యధికంగా 148.2 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయంగా 84 పరుగులు చేసి భారత్‌కు ఏడు వికెట్ల విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Read Also: కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రాకు స్థానం.. కానీ..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>