Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ అటవీశాఖ కీలక నిర్ణయం.. ఏనుగులకు ‘ఆధార్’!

కలం, వెబ్‌డెస్క్: గజరాజుల రక్షణ కోసం ఏపీ అటవీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగుల (Kumki Elephants) కు “ఆధార్ తరహా” గుర్తింపు కార్డులు ఇవ్వాలని అటవీ శాఖ కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో కుంకీ ఏనుగులకు అటవీశాఖ అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల అనంతరం అధికారులు వాటిని డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. పరీక్షల ఫలితాలు వచ్చాక కుంకీ ఏనుగులకు గుర్తింపు కార్డులు అమలు చేస్తారు. ఈ కార్డుల్లో ప్రతి కుంకీ ఏనుగు గురించి కీలక సమాచారం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఏనుగులకు వైద్యం చేయించాలన్నా, జన్యుపరమైన సమస్యలు వచ్చినా ఈ కార్డు ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>