కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బి.శివధర్ రెడ్డి (Shivadhar Reddy)బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే డీజీపీగా రిటైర్డ్ అయిన ఆయనకు.. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ హోదాతో ఈ పదవిని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. ఇలాంటి పోస్టును తొలిసారి ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో ఆయనకు కార్యాలయం ఏర్పాటు చేయగా.. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగబోతున్నారు. పోలీస్, లా అండ్ ఆర్డర్, అంతర్గత భద్రత, క్రైం కంట్రోల్, నార్కోటిక్స్ కంట్రోల్, రోడ్ సేఫ్టీ విభాగాలపై ఆయన పర్యవేక్షణ, సలహాలు సూచనలు అందించబోతున్నారు.
గవర్నర్‌ను కలిసి..
తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బి.శివధర్ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాద పూర్వకంగా కలవగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర భద్రత గురించి అనేక అంశాలను ఇరువురు కలిసి చర్చించారు.

