సర్ ప్రక్రియలో సమన్వయంతో పని చేయాలి: కూచాడి శ్రీహరి

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) శుక్రవారం పరిశీలించారు. అస్రాకాలనీ, ఇంద్రానగర్, ద్యాగవాడ, ప్రియదర్శిని నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి, బూత్ లెవల్ అధికారులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రక్రియలో ఖచ్చితత్వం పాటిస్తూ ప్రతి దరఖాస్తును సకాలంలో నమోదు చేయాలని కోరారు. చిన్నపాటి పొరపాటు వల్ల కూడా అర్హులైన ఓటర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు.

Read Also: వీడిన నిర్మల్ సంచలన హత్య కేసు మిస్టరీ.. సవతి తల్లే హంతకురాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>