వాస్తాపూర్‌లో కొత్త అంగ‌న్ వాడీ కేంద్రం ప్రారంభం!

క‌లం, నిర్మ‌ల్‌: లోకేశ్వరం మండలం వాస్తాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం వట్టోలి గ్రామంలో రూ.37 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. విద్యాభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన అభివృద్ధి పనులను కొనసాగిస్తామని ఎమ్మెల్యే (Pawar Ramarao Patel) స్పష్టం చేశారు.

Read Also: వీడిన నిర్మల్ సంచలన హత్య కేసు మిస్టరీ.. సవతి తల్లే హంతకురాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>