14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటు.. సీఎంకు కేటీఆర్ లేఖ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో 14 లక్షల మంది విద్యార్థులకు రేవంత్ రెడ్డి (CM Revanth) వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. బకాయిలు విడుదల చేయకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును సీఎం అంధకారంలోకి నెట్టాడని మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా రేవంత్? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement)ను రద్దుచేసేందుకే చీకటి జీవో 7 తీసుకొచ్చారని.. దుర్మార్గమైన జీవోను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు కేసీఆర్ తీసుకువచ్చిన స్కీంలకే కాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పాతరేస్తావా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఓవైపు గురుకులాలను దెబ్బతీసి.. ఉన్నత విద్యకూ ఉరివేస్తావా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని.. ఈ విషయాని గుర్తుపెట్టుకోవాలి హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>