Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్ట్ మార్గదర్శకాల మేరకు ఆయన 2027 మే నెల వరకు రెండేళ్ల పాటు డీజీపీగా కొనసాగబోతున్నారు. 2024లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హరీశ్ కుమార్ గుప్తా మొదటిసారి డీజీపీగా నియమితులయ్యారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో బదిలీ అయి, తిరిగి మే 31, 2025న డీజీపీగా ఛార్జ్ తీసుకున్నారు.

సుప్రీంకోర్ట్ సీరియస్ కావడంతోనే..

డీజీపీల నియామకాల్లో అనేక రాష్ట్రాలు నిబంధనలను పాటించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్లు నమోదు అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్ట్ సీరియస్ కావడంతో.. సీనియార్టీ పరంగా మొదటి స్థానంలో ఉన్న హరీశ్ కుమార్ గుప్తానే ఇక పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. డీజీపీ పోస్టుతో పాటు విజిలెన్స్, ఎన్‌‌ఫోర్స్‌మెంట్ అధిపతిగా కూడా విధులు నిర్వర్తించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>