కలం, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో పానీపూరి తిని 24 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒక్కో చిన్నారి వద్దకు వెళ్లి, తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా సీరియస్ ఉంటే.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలిస్తామని హామీ ఇచ్చారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కూడా పిల్లలను పరామర్శించిన వారిలో ఉన్నారు.
కలుషిత నీరు కారణంగానే..
పానీ పూరి కోసం ఉపయోగించిన నీరు పూర్తిగా కలుషితమైనందునే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని వివరించారు. కాగా, సదరు పానీ పూరి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్’ ట్రెండ్
Follow Us On: Instagram

