Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ భావజాలంపై సీఎం రేవంత్ దాడి: కవిత

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసేసి రూపు రేఖలు మార్చారని రేవంత్ సర్కార్ పై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరుసటి రోజు నుంచే తెలంగాణ భావజాలంపై దాడి చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర పతాకంపై కాకతీయ తోరణం, పూర్ణకుంభం తీసేందుకు నిర్ణయంపై ప్రజా వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లిని విస్మరణకు గురి చేశారని చెప్పారు.

ప్రతి కలెక్టర్ సముదాయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలల కాలం గడుస్తున్నా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు- సాధన- భవిష్యత్ కార్యచరణ అనే అంశంపై కరీంనగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కవిత (Kavitha) మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణ అస్తిత్వంపై అనేక ప్రశ్నలు ప్రాంతీయతర శక్తులు అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల కోసం పోరాటం చేసిన ప్రభుత్వంలో చలనం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వమే ఉద్యమకారులను గుర్తించడం లేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. 1200 మంది అమరవీరులెవరూ జాబితా ఏమిటి అనేవి పట్టింపు లేదన్నారు. జార్ఖండ్ లో స్వతంత్ర పోరాటం కోసం చేసిన త్యాగాలను గుర్తించి వారికి అనేక అంశాల వారిగా అమలు చేశారని చెప్పారు.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>