కేటీఆర్ సిబ్బందిపై దాడి.. డీసీపీ ఏమన్నారంటే..?

కలం, వెబ్ డెస్క్ : సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వోలపై దాడి జరిగిందన్న ప్రచారాన్ని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి (DCP Shilpavalli) ఖండించారు. అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ కేసుకు సంబంధించి వారిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచినట్లు తెలిపారు.

అదే సమయంలో గణేష్ మండపం వద్ద డీజే నిర్వహణకు అనుమతి కోసం కొంతమంది స్థానిక యువకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు. సీఐ వారితో మాట్లాడుతుండగా, ఆ యువకులలో ఒకరు అక్కడే ఉన్న కేటీఆర్ పీఆర్వోను గుర్తుపట్టాడని తెలిపారు. ‘అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వారిని ఇక్కడ మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతారా?’ అని ఆ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు వివరించారు. అలా మాట్లాడకూడదని సీఐ వారించడంతో ఆ యువకులు అక్కడ నుంచి వెళ్ళిపోయారని స్పష్టం చేశారు.

అనంతరం బీఆర్ఎస్ నాయకులు తమ వారిపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని డీసీపీ వెల్లడించారు. పరిశీలనలో అక్కడ ఎలాంటి దాడి జరగలేదని తేలిందని, వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>