ఏపీ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్: ప్రభుత్వం కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఉపశమనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాన్-యూనిఫాం ఉద్యోగాల (AP Govt Jobs) భర్తీకి సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఈ పెంచిన వయోపరిమితి నిబంధన 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అయితే ఈ వయోసడలింపు నిబంధన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, అటవీ శాఖల వంటి యూనిఫాం పోస్టులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా చేపట్టే నాన్-యూనిఫాం పోస్టుల భర్తీకి ఈ నిర్ణయం ఎంతో మంది నిరుద్యోగులకు ఊరటనివ్వనుంది.

Also Read : భారత్‌తో వివాదాలపై చైనా కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>