ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగికి కేటీఆర్ ఫోన్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వేణును పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి ద్వారా కేటీఆర్, వేణుతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదని, నిరుద్యోగుల సమస్యలపై అధైర్యపడకుండా కలిసికట్టుగా పోరాడదామని కేటీఆర్ ఆయనకు సూచించారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన వేణు కుమార్ ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు అండగా నిలిచింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వేణు కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>