కలం, వెబ్ డెస్క్ : దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మార్కెట్ లో ప్రవేశించే వాహనాల్లో వెహికల్-టు-వెహికల్ కమ్యూనికేషన్ (V2V Communication) సిస్టమ్‌ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని నూతన వాహనాల్లో వెహికల్-టు-వెహికల్ సిస్టమ్ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి అన్ని రకాల వాహనాలు (ద్విచక్ర, మూడు చక్రాల బండ్లు, ఫోర్ వీలర్, బస్సులు, ట్రక్కులు వంటి L, M, N కేటగిరీలు) AIS-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్దేశించింది.
వెహికల్-టు-వెహికల్ వ్యవస్థ ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి రియల్ టైమ్ వేగం, స్థానం, దిశ, బ్రేకింగ్ కు సంబంధించిన సమాచారం చేరవేసుకుంటాయి. దీని ద్వారా మలుపులు, ఇంటర్ సెక్షన్ లు, తప్పుడు డైరెక్షన్ వంటి ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలు నడిపే వారికి ముందుగానే హెచ్చరికలు అందుతాయి. అయితే, ఈ వ్యవస్థ సెల్యులార్ నెట వర్క్ లేకుండా పనిచేయడం గమనార్హం.
2027 అక్టోబర్ 1 నుంచి వెహికల్-టు-వెహికల్ వ్యవస్థ ఉన్న వాహనాలు AIS-230 ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, 2028 నుంచి అన్ని కొత్త వాహనాల్లో తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. వాహనదారుల తయారీదారులకు ఈ సిస్టమ్ (V2V Communication) కి సిద్ధం కావడానికి దశలవారిగా సమయం ఇచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చాయి.
ఈ వ్యవస్థకు సంబంధించి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజులు సమయం కేటాయించారు. V2V ద్వారా కేంద్రం రోడ్డు భద్రత పెంచడం, కనెక్టెడ్ మొబిలిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వెహికల్స్‌లో కొత్త టెక్నాలజీ.. రోడ్డు ప్రమాదాలకు గుడ్ బై
-‘టాకింగ్ వెహికల్స్’ సిస్టమ్ తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం
-2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని కొత్త వాహనాల్లో వెహికల్-టు-వెహికల్ కమ్యూనికేషన్ (V2V) సిస్టమ్
-ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు రియల్‌టైమ్‌లో వేగం, స్థానం, దిశ,… pic.twitter.com/3tmctOQnkR— Kalam Daily (@kalamtelugu) August 4, 2026

