కలం, వెబ్ డెస్క్: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పైపైకి దూసుకుపోవడంతో కొనుగోలు దారులు బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ బులియన్లో మార్కెట్లో బంగారం, వెండి ధరలకు మరోసారి (Gold Price Hike) రెక్కలొచ్చాయి.
శనివారం నాటి మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాములపై రూ.1.420 పెరిగి, రూ. 1,55,840కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 10 గ్రాములపై రూ.1,300 పెరిగి, రూ. 1,42,850 కి చేరింది. ఇటు వెండి ధర కిలోపై రూ. 5 వేలు పెరిగి రూ. 2.60 లక్షలకు చేరింది.

