ఇది ప్ర‌భుత్వం కాదు.. రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ: కేటీఆర్‌

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో ఉన్న‌ది ప్ర‌భుత్వం కాద‌ని, రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప‌లు చోట్ల జ‌రుగుతున్న ఇండ్ల కూల్చివేల‌త‌పై కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు గాంధీ కుటుంబానికి పంపుతాన‌ని మాట ఇచ్చాడ‌ని, అందుకే పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు రెడీ చెయ్యాలని చూస్తున్నాడ‌ని ఆరోపించారు. పేదల ఇళ్లు కూలగొడుతూ హైదరాబాద్‌లో తన రెండవ పాలస్ కట్టుకుంటున్నాడ‌ని వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లు పెకిలించి వేస్తూ మరో పక్క తన కోటకు గోడ‌లు క‌ట్ట‌డానికే తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నాడ‌న్నారు.

సీఎంతో పాటు మంత్రుల‌పైనా కేటీఆర్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) మూడో ఇల్లు కట్టుకుంటున్నాడ‌ని, పొంగులేటి పదో కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నాడ‌ని ఆరోపించారు. ఇలా వీళ్లు మాత్రం ఎదుగుతూ పేదల జీవితాలను మాత్రం రోడ్డున పడేశార‌న్నారు. ఇది ప్రభుత్వం కాద‌ని, రియల్ ఎస్టేట్ కంపెనీ అని, వీళ్లు మంత్రులు కాద‌ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ కేటీఆర్ (KTR) ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

Read Also: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చీట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>