ప్రేమ పెళ్లి.. రోజు గ‌డ‌వ‌క‌ ముందే యువ‌కుడి హ‌త్య‌

క‌లం, వెబ్ డెస్క్‌: తూర్పు గోదావ‌రి (East Godavari) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకుంద‌న్న కోపంతో అన్న‌ద‌మ్ములు ఆమె భ‌ర్త‌ను చంపేశారు. మండ‌పేట మండ‌లం వేముల‌ప‌ల్లిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాయ‌వ‌రం డిప్యూటీ ఎమ్మార్వో అయిన‌వ‌ల్లి సంధ్య‌, సూర్య ప్ర‌కాశ్ గ‌త కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఫిబ్ర‌వ‌రి 26న ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అన్న‌వ‌రంలోని ఆల‌యంలో పెళ్లి చేసుకున్నారు. విష‌యం తెలుసుకున్న సంధ్య సోద‌రులు ఆవేశంతో ర‌గిలిపోయారు. పెళ్లి చేసుకున్న కొన్ని గంట‌ల‌కే సంధ్య‌, సూర్య ప్ర‌కాశ్ ఆచూకీ తెలుసుకొని వెళ్లారు. సూర్య ప్ర‌కాశ్‌పై రాళ్ల‌తో దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాల‌పాలైన సూర్య ప్ర‌కాశ్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఈ ఘ‌ట‌న తీవ్ర‌ క‌ల‌కలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>