Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యేల ఫిరాయింపు స్పీకర్‌కు కనిపించడం లేదా?: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అప్పుల పేరుతో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెబుతోందన్నారు. పాలన చేతగాక అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. శిశుపాలుడి తప్పుల్లా రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని చెప్పారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ దృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు స్పీకర్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గడ్డం ప్రసాద్ గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ అప్పులు చేసి పోయాడని అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలు ఆడితే తమ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదని హెచ్చరించారు. ఆర్బీఐ, కాగ్ వద్ద నుండి లెక్కలు తీసుకొని పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 వేల కోట్లని నిండు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. కానీ స్పీకర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని చెబుతున్నారని, ఇంకొకరు రూ. 9 లక్షల కోట్లు, మరొకరు రూ.10 లక్షల కోట్లు అని, నోటికి ఎంత వస్తే అంత చెబుతున్నారని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>