ఉత్తరాంధ్రకు మణిహారం.. నేడే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం (Bhogapuram Airport) నేడు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ఉదయం 10:45 గంటలకు భోగాపురం చేరుకుని, ఈ సరికొత్త విమానాశ్రయాన్ని దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేసిన ఈ భారీ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనుండటంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు సాగనుంది. విమానాశ్రయ టెర్మినల్ వద్దకు ప్రధాని చేరుకోగానే గిరిజన సాంప్రదాయ థింసా నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. అలాగే టెర్మినల్ భవనం దగ్గర 200 మంది విద్యార్థులు ప్రదర్శించే కూచిపూడి నృత్య ప్రదర్శనను ప్రధాని వీక్షించనున్నారు.

ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు ఎయిర్‌పోర్టు అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీప్‌లో భారీ బహిరంగ సభా వేదిక వైపునకు వెళ్లనున్నారు. ఈ మహాసభలో ఉత్తర ఆంధ్రా ప్రాంత ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రధాని మోదీ తిరిగి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ భారీ పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమం దృష్ట్యా భోగాపురం పరిసర ప్రాంతాలలో పోలీసులు మూడంచెల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>