Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ విషయంలో రేవంత్‌ రికార్డ్‌ : కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్‌ : తెలంగాణలో పెరుగుతున్న నేరాలపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మహిళలపై నేరాలు, సైబర్ క్రైమ్ రేటు దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని ఆయన విమర్శించారు.

దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోంమంత్రిగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ‘తెలంగాణ నిజంగానే ఎదుగుతోంది’ అంటూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం నేరాల నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>