epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

టీడీపీని తెలంగాణకి తెచ్చే కుట్రలను తిప్పికొడతారు : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : టీడీపీని మళ్లీ తెలంగాణ గడ్డమీదకు తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. దాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ దిమ్మెలను కూల్చాలి అనడం అంటే ప్రజాస్వామ్యాన్ని మట్టిలో కలిపేయడమే అన్నారు కేటీఆర్. సీఎంగా, హోంమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ ఎస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక నేరాలను ప్రోత్సహించేలా సీఎం మాట్లాడుతున్నారని కేటీఆర్ (KTR) కామెంట్ చేశారు.

బీఆర్ ఎస్ పదేళ్ల హయాంలో అత్యుత్తమ పోలీస్ వ్యవస్థను నడిపిస్తే.. కాంగ్రెస్ హయాంలో బీఆర్ ఎస్ ను టార్గెట్ చేయడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధమని.. ఆయనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. గత రెండేళ్లుగా పాతబాసు ఆదేశాలనే సీఎం రేవంత్ రెడ్డి పాటిస్తూ జలహక్కులను కాలరాశారని ఇవాల్టి ప్రకటనతో తేలిపోయిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ మునిగిపోతోందని సీఎం రేవంత్ గ్రహించి.. ఏ క్షణం అయినా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. నీళ్లు, నిధుల విషయంలో సీఎం రేవంత్ చేస్తున్న కోవర్టు రాజకీయాలను తెలంగాణ సమాజం గట్టి బుద్ధి చెబుతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>