Mobile Popup Ad
Mobile Popup Ad

సాగర్ ఎడమ కాల్వ వైపు వెళ్తున్నారా.. బీ అలర్ట్

కలం, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాల్వ వద్ద ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాగర్ ఎడమ కాల్వలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా ఆంక్షలు (Restrictions) విధించింది. కాల్వ పరిసర ప్రాంతాలవాసులు, పర్యాటకులు కాల్వలో దిగి స్నానాలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. కాల్వ గట్టుపైకి వెళ్లడం, నీటిలోకి దిగి బట్టలు ఉతకడం, సెల్ఫీలు దిగడం లాంటివి చేయొద్దని సూచించారు.

కాల్వ వెంబడి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పశువులను కూడా తీసుకెళ్లొద్దని పోలీసులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>