epaper
Thursday, March 5, 2026
epaper

అమిత్ షాతో ముగిసిన సీఎం రేవంత్ మీటింగ్

కలం, డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth), పోలీస్ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు అమిత్ షాతో సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్, ఎస్ఐబీ ఐజీ సుమతి చర్చలు జరిపారు. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాకు సీఎం రేవంత్ నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు సీఎం రేవంత్ రాష్ట్ర భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు.. పోలీస్ విభాగం బలోపేతం కోసం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలతో పాటు సైబర్ నేరాలను ఎదుర్కోవడం అనుసరిస్తున్న విధానాలను సీఎం వివరించారు.

మావోయిస్టుల గురించి..

అలాగే గ్రేటర్ పరిధిలో ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లు ఉండగా.. తాజాగా ఫ్యూచర్ సిటీలో మరో పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. అందువల్ల తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. అలాగే అజ్ఞాతం వీడి బయటకు వస్తున్న మావోయిస్టుల గురించి చర్చించారు ఇరువురు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ఏర్పాట్ల గురించి సీఎం వివరించారు. మిగిలిన వారి లొంగుబాటు కోసం తీసుకుంటున్న చర్యలను కూడా అమిత్ షాతో సీఎం రేవంత్ చర్చించారు. మొత్తం 591 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు అమిత్ షాకు వివరించారు సీఎం.

ఇలాగే సపోర్ట్ చేయాలి..

వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ కు తెలంగాణ పోలీసులు సహకరించారని.. పూర్తయ్యే దాకా ఇలాగే సహకరించాలంటూ అమిత్ షా సూచించారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని.. తెలంగాణలో ఈగల్ టీమ్ ను మరింత బలోపేతం చేయాలన్నారు అమిత్ షా.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!