Mobile Popup Ad
Mobile Popup Ad

కలెక్టరేట్ ప్రకృతి వనంలో అగ్నిప్రమాదం

కలం, జనగామ : జనగామ (Jangaon) కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని ప్రకృతి వనంలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కొన్ని చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి మంటలను చల్లార్చారు. మంటలు మిగతా చెట్లకు, భవనాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయ ఆవరణల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎండు గడ్డి లేదా చెత్తను తగలబెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>