కలం, వెబ్ డెస్క్: వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగహక్కులను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. పేదవాళ్లను టార్గెట్ చేసి బుల్‌డోజర్లు పంపుతున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు సంబంధించిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎక్కడ ఇండ్లు కూల్చేశారో అక్కడే పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు?
జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. కొన్ని పార్టీలు వెలుగుమట్లను ఎగ్జిబిషన్‌లా సందర్శించాయని ఆరోపించారు. తాను మాత్రం సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తానని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటానని చెప్పారు. ప్రభుత్వానికి ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని ఖూనీ చేసేలా పేదల ఇండ్ల మీదకు బుల్జోజర్లు వస్తున్నాయని విమర్శించారు.
పునరావాస కేంద్రంలో వసతులు లేవు
వెలుగుమట్ల బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కనీస వసతులు లేవని కవిత (Kavitha) ఫైర్ అయ్యారు. పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా గదులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ‘తమది ఒక్కటే నినాదం ఎక్కడైతే ఇండ్లను కూల్చేశారో అక్కడే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి’ అంటూ కవిత స్పష్టం చేశారు. ‘ఏ రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ మాట్లాడతారో.. అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు.’ అంటూ కవిత పేర్కొన్నారు. తాను బాధితుల పక్షాన నిలబడతానని పేర్కొన్నారు.
Read Also: ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడుతాం : కేటీఆర్
Follow Us On: X(Twitter)

