జీవన్ రెడ్డికి కేటీఆర్ కీలక హామీ

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి పార్టీలకతీతంగా స్నేహం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరమే బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారని.. కానీ అప్పట్లో ఆయన సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద జీవన్ రెడ్డికి ఉన్న నిబద్దత అలాంటిదని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి గొప్ప నాయకుడని.. రైతుల కోసం పేదల కోసం నిరంతరం తపించారని గుర్తు చేశారు. అటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

జీవన్ రెడ్డిని మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం

జీవన్ రెడ్డి(Jeevan Reddy)ని బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆయన పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ల విషయంలో ఎంతో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని.. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నారని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికే మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని పేర్కొన్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంత కండలు తిరిగిన వస్తాదయినా మూడు నెలల్లో పిల్లల్ని పుట్టించలేడు కదా అంటూ హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత సంస్కారహీనంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మరి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పారంటూ ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>