నాడు చంద్రబాబును నిలదీసిన రైతు.. నేడు కేటీఆర్ పలకరింపు

కలం, వెబ్ డెస్క్: వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో భాగంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనదైన ముద్ర వేసిన రైతు ఫణికర మల్లయ్యను కేటీఆర్ (KTR) ఆత్మీయంగా పలకరించారు. ఫణికర మల్లయ్య (Phanikara Mallaiah) నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మీ కోసం’ యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా రాయపర్తి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో వేదికపై నుండి తనతో ఎవరైనా మాట్లాడతారా అని అడిగాడు. అందరూ మౌనంగా ఉన్నా మల్లయ్య మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చారు.

‘మా తెలంగాణ మాకిత్తె మా బతుకేదో మేం బతుకుతం’ అని చంద్రబాబును నిలదీశాడు. ఆనాటి ఉద్యమ ఆకాంక్షను చాటిచెప్పారు. మల్లయ్య తెగింపునకు అవాక్కైన చంద్రబాబు (Chandrababu) అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కేసీఆర్ మల్లయ్యకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, అనేక ఉద్యమ వేదికల మీద ఆయన ధైర్యాన్ని కొనియాడారు. బుధవారం కేటీఆర్ (KTR) ఆయనను కలవడంతో ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Read Also: విజయ్‌కు షాక్.. తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>