కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్‌పై కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాస్‌పోర్ట్ సీజ్ చేశారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ లాయర్ జక్కుల లక్ష్మణ్ (Lawyer Jakkula Laxman) ప్రకటించారు. తమకు ఇప్పటివరకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు కేవలం కేటీఆర్ పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ కోరుతూ మెమో దాఖలు చేశారని చెప్పారు. అంతే తప్ప ఈ విషయంలో ఇంకా కోర్టు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే.. కౌంటర్ దాఖలు చేసి తమ వాదనలు కూడా వినిపిస్తామన్నారు. అంతేగాకుండా.. ఏసీబీ ఎలాంటి అభ్యంతరాలు తెలిపిందో కూడా తాము అధ్యయనం చేస్తామన్నారు. పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమన్నారు.

అసలేం జరిగిందంటే..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ–రేసు (Formula E Race) వ్యవహారంలో అవినీతి జరిగిందని 2024 డిసెంబరులో ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ (KTR), స్పెషల్ చీఫ్​ సెక్రటరీ అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి రూ.55 కోట్లను ఫార్ములా ఈ–ఆపరేషన్స్ సంస్థకు బదిలీ చేశారని ముగ్గురిని నిందితులుగా చేర్చింది. వీరిలో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతోంది. దీనిలో భాగంగా కేటీఆర్ విదేశాలకు వెళ్లకుండా.. పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేఖ రాసింది. కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ అయిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తరఫు లాయర్ క్లారిటీ ఇచ్చారు.

Also Read : నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ మాస్ వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>