కలం, నిర్మల్ రూరల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సమన్వయంతో మంగళవారం న్యాయ అవగాహన (Legal Awareness) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ హాజరై గ్రామస్తులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా న్యాయ సేవల చట్టం, వృద్ధుల సంరక్షణ చట్టం, వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు, రైతులకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలపై వివరించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వసంత్‌రావు, గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకట్ రెడ్డి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

