నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం.. కొండా సురేఖ మాస్ వార్నింగ్

కలం, వరంగల్: కాంగ్రెస్ నాయకులు నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరుజారి మాట్లాడితే మహిళలతో ఎక్కడ దొరికితే అక్కడ కొట్టిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 112 చెక్కులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

అనంతరం మహిళా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థుల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, KUDA ఛైర్మెన్ గుండు సుధారాణికి ఈ మేరకు ఆమె (Konda Surekha) కౌంటర్ ఇచ్చారు. తన వెనక నిలబడ్డ మహిళలు ఒక్కొకరు నలుగురిని కొడతారని.. తమ ముందు కుప్పి గంతులు వేస్తే ఆడవాళ్ళతో కొట్టిస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

Also Read : ప్రధాని మోదీ రాజీనామా చేయాలి: కేసీ వేణుగోపాల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>