ఫార్ములా ఈ- రేస్ కేసు.. కేటీఆర్ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జిషీట్‌లో నుంచి తన పేరు తొలగించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిశ్ఛార్జ్ పిటిషన్ వేశారు. దీనిపై త్వరలోనే కోర్టు విచారణ చేయబోతుంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు చేర్చారు. ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్​ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ పలుమార్లు ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. కోర్టుకు కూడా ప్రత్యక్షంగా హాజరయ్యారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

అసలు కేసు ఏంటీ..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ–రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి చేసిన చెల్లింపుల్లో రూ.55 కోట్ల అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. దీనిక ప్రధాన బాధ్యుడిగా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా హెచ్ఎండీఏ నుంచి నిధులు విడుదల చేయాలని ఆదేశించడం, ఆర్బీఐ అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు డాలర్లలో నిధులు చెల్లించడం వంటి అంశాలను పొందుపర్చింది. ఫార్ములా సంస్థకు లబ్ధి చేకూర్చుతూ.. ఎన్నికల బాండ్లు స్వీకరించిందని ఏసీబీ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>