కలం, నిర్మల్ : ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసనల్లో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Srihari Rao) పాల్గొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శ్రీహరి రావు పాల్గొని నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడి ఓటు హక్కును కాపాడేలా తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.

