తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు (Telangana Rains) పడుతున్నాయి. చాలా రోజుల తరువాత వరుణుడు పలకరించడంతో ప్రజలు పులకించిపోయారు. యాదాద్రి భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్, మేడ్చల్, జనగామ, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలో కూడా అర్ధరాత్రి నుంచి వాన జోరందుకుంది. పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. పటాన్ చెరు, ఆర్సీ పురం, అమీన్ పూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్, బాలానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. అసలే భూగర్భ జలాలు అడుగంటిపోయి.. నీటి ఇబ్బందులు ఏర్పడిన తరుణంలో వరుణుడి రాకతో కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగానే వర్షాలు పడుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>