కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ వేళ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR )నివాసంలో పండుగ సందడి నెలకొంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో (Erravalli Farmhouse) కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకుంటూ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఫోటోలో కేసీఆర్ (KCR), ఆయన సతీమణి శోభమ్మతో పాటు, కేటీఆర్ (KTR), ఆయన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య కనిపిస్తున్నారు. అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబింపజేశారు. అయితే, గతంలో ప్రతి పండుగకు కుటుంబమంతా ఒక్కచోట చేరేవారు, కానీ ఈసారి కేసీఆర్ కుమార్తె కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఆమె ఈ వేడుకల్లో కనిపించలేదు. కేవలం కుమారుడి కుటుంబం మాత్రమే కేసీఆర్ దంపతులతో కలిసి పండుగ సంతోషాన్ని పంచుకుంది.
Read Also: హైదరాబాద్‌కు సదరన్ కమాండ్: సీఎం విజ్ఞప్తి
Follow Us On : WhatsApp


