తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లపై కపట ప్రేమ కనబరుస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శలు చేశారు. అందులో ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కిమరీ అభినందన సభ పెట్టించుకుని.. సినిమా వాళ్లపై వరాలు కురిపించారని చురకలంటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి ఆఖరు రోజు కావడంతో.. ఆదివారం కేటీఆర్.. యూసఫ్‌గుడాలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘జూబ్లీహిల్స్(Jubilee Hills)లో గట్టిగా కొడితే రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటాడో, మూడు నెలలు ఉంటాడో తెలుస్తుంది. ఢిల్లీలో నల్గొండ, ఖమ్మం లీడర్లు సీఎం కుర్చీ కోసం కత్తులు నూరుతున్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నికలు లేనప్పుడు సినిమా వాళ్లని జైల్లో పెడతాడు.. ఎన్నికలు ఉంటే సినీ కార్మికులను ఓట్ల కోసం బ్రతిమాలుతాడు. మొన్న యూసఫ్ గూడలో సినీ కార్మికులతో బలవంతపు సన్మానం చేయించుకున్నాడు’’ అంటూ KTR ఎద్దేవా చేశారు.
Read Also: చిరుకు ఆర్‌జీవీ సారీ.. అసలేం జరిగిందంటే..!
Follow Us on: Youtube

