Mobile Popup Ad
Mobile Popup Ad

నీట్ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ‘నీట్’ (NEET UG-2026) పరీక్షల స్కాం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధానిని కోరారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. మలేషియా పర్యటనకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో నీట్ బాధితులు, లాంగ్ టర్మ్ విద్యార్థులతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు.

ముమ్మాటికీ ఇది అన్యాయమే..

రాత్రింబవళ్లు కష్టపడి చదివి 520కి పైగా మార్కులు సాధించినా, పేపర్ లీక్ కావడం వల్ల తమ శ్రమ అంతా వృథా అయిందని కేటీఆర్ ఎదుట విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లే ముందు తమను అణువణువూ తనిఖీ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు, పేపర్ లీక్‌ కాకుండా ఎందుకు చూడలేదని విద్యార్థులు నిలదీశారు. తప్పు ఎన్టీఏ బోర్డు చేసి, విద్యార్థులను మళ్లీ పరీక్షలకు కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. విద్యార్థులకు ధైర్యం చెప్పారు. తమ కోపంలో 100 శాతం న్యాయం ఉందని.. ఈ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తప్పు చేసిన పెద్దలను వదిలేసి.. మళ్లీ పరీక్షకు కూర్చోబెట్టడం ముమ్మాటికీ అన్యాయమే అవుతుందని చెప్పారు. కానీ, ఇదొక తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిదని.. తమ కసిని, ఎనర్జీని సరైన దిశలో పెట్టి మళ్లీ పరీక్షలపై ఫోకస్ చేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>