కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంఘీభావంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా ఈ ఏడాది తన పుట్టినరోజు (శుక్రవారం) వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన నిశ్చయించుకున్నారు.
దేశ రాజధానిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల అణచివేత చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రేపు భారీ నిరసన కార్యక్రమం జరగనుంది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఈ ధర్నాలో కేటీఆర్ స్వయంగా పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.

