Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్​పై అనుచిత వ్యాఖ్యలు.. జనసేన నేత అరెస్ట్​

క‌లం, వెబ్ డెస్క్: ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దేవరకొండ జనసేన నాయకుడు చందు నాయక్ (Chandu Naik)​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల జనసేన (Janasena) అధినేత పవన్​ కల్యాణ్ తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు పవన్​ కల్యాణ్​ జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జన సైనికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా చందు నాయక్​ సీఎం రేవంత్​ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి పవన్​ సభకు అనుమతి ఇవ్వలేదని, ఆయనను బలిస్తామంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో పోలీసులు చందు నాయక్​పై శుక్రవారం కేసు నమోదు చేసి నేడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జనసేన లీగల్​ సెల్​ తరఫున చందు నాయక్​కు అండగా ఉంటామని పార్టీ ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>