epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్ నిజాయితీ గల మోసగాడు : కేటీఆర్

కలం, వెబ్​ డెస్క్​: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిని ఒక ‘నిజాయితీ కలిగిన మోసగాడు’గా అభివర్ణించాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్, వారి అనుచరులు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చేస్తున్న నిరసనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్  డిమాండ్ చేశారు. దిల్‍సుఖ్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులను కలిసిన గాంధీనగర్ ప్రాంతానికి వెళ్ళడానికి రేవంత్ రెడ్డి సాహసించడం లేదని, కేవలం మీడియాలో ప్రచారం కోసం జాబ్ క్యాలెండర్ ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తూ, అవి తామే ఇచ్చామని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి అబద్ధపు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ 24 నెలల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వద్ద డబ్బులు లేక వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఉపాధి కరువైందని తెలిపారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, మిషన్ భగీరథ ద్వారా తీరిన తాగునీటి కష్టాలను ప్రజలు నేడు గుర్తు చేసుకుంటున్నారని, కేసీఆర్ కనిపిస్తేనే ప్రజలకు ధైర్యం వస్తోందని ఆయన అన్నారు.

హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సహనం కోల్పోతున్నారని కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ రెడ్డికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల కంటే ‘బూతుల భాష’ బాగా వచ్చని, ప్రతి ఒక్కరినీ దూషించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏ అభివృద్ధిని చూసి పార్టీ మారారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేసిన ముఖ్యమంత్రితో ఆయన ఎలా చేతులు కలిపారని కేటీఆర్ ప్రశ్నించారు.

Read Also: మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: డిప్యూటీ సీఎం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>