అనంతగిరి బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనపై కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం, పలువురు గాయపడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారందరూ తర్వగా కోలుకోవాలని ఆకాక్షించారు.

క్షతగాత్రులను వెంటనే రక్షించి, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. అంతేకాకుండా ప్రమాదంలో చిక్కుకున్న వారికి అవసరమైన సహాయం అందేలా స్థానిక నాయకులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>