బస్సు, మెట్రోలో ప్రయాణించిన మంత్రులు

కలం, వెబ్ డెస్క్ : ప్రజా రవాణాను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌ (Common Pass)ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల బృందం స్వయంగా పరిశీలించింది. ప్రజా భవన్ నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుండి వారు కామన్ పాస్ సహాయంతో మెట్రో రైలు ఎక్కి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ప్రయాణించారు.

నిలిచిన ఎస్కలేటర్..

అయితే బేగంపేట మెట్రో స్టేషన్‌ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఒకేసారి రావడంతో ఊహించని సంఘటన జరిగింది. జనసందడి ఎక్కువ కావడంతో బేగంపేట స్టేషన్ ఎస్కలేటర్ ఉన్నట్టుండి మధ్యలోనే ఆగిపోయింది. ఎస్కలేటర్ నిలిచిపోవడంతో మంత్రులు మెట్లపై నడుచుకుంటూనే ప్లాట్‌ఫామ్‌‌పైకి చేరుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>