Mobile Popup Ad
Mobile Popup Ad

ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌దే గెలుపు: కేటీఆర్

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ వైఫల్యాలపై కదం తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కరీంనగర్ మొదటి నుంచి బీఆర్‌ఎస్‌కి కంచుకోట మాదిరిగా అండగా నిలిచిందని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ రెండున్నర పాలన తర్వాత ప్రజలు బీఆర్ఎస్‌ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందన్నారు.

సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పనితీరు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీటితోపాటు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ పైన జరుగుతున్న కార్యక్రమాలను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి మరింత పనిచేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలో కీలకమైన సింగరేణిపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తుచేయాల్సిన అవసరం ఉందన్నారు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ కాళేశ్వరంలో ప్రాజెక్టులో నీరు పారుతున్నదని కేటీఆర్ గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>