Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్, భట్టి లెక్కల్లో పొంతన లేదు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తమపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఢిల్లీలో గౌరవం లేనప్పుడు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని ఫైర్ అయ్యారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. తెలంగాణ గొప్పతనం, అభివృద్ధి రేవంత్ రెడ్డికి తప్ప అందరికీ అర్ధం అయిందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పార్లమెంట్‌లోనే సమాధానం చెప్పారు..

తెలంగాణ అప్పులు ఎంతో పార్లమెంట్‌లోనే సమాధానం చెప్పారని అన్నారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర అప్పు రూ.72 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దిగిపోయేనాటికి అప్పు రూ.3.5 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. అప్పులపై వాస్తవాలు దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య లెక్కల్లోనే పొంతన లేదని మండిపడ్డారు. దండుపాళ్యం ముఠా లాగా కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పేరుతో రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు. రుణమాఫీలో రూ.20 వేల కోట్లు ఎగ్గొట్టారని దుయ్యబట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>