ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖీలకు శిక్షణ

కలం, జోగులాంబ గద్వాల : జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కేటిదొడ్డి రైతు వేదికలో కృషి సఖీలకు (Krishi Sakhi) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, సాగు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేలా కృషి సఖీలు కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. వీరప్ప, సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రతాప్ కుమార్, వ్యవసాయ అధికారులు శ్రీలత, హన్మంతు రెడ్డి, రాజవర్ధన్, ఏఈఓలు, కృషి సఖీలు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>